Saturday, 29 October 2022

news 18 page

 https://telugu.news18.com/news/telangana/jagtial-youth-develops-vaddi-app-for-people-to-calculate-loan-interests-easily-knr-sk-1469514.html


పల్లెల్లో నిత్యం అప్పులు తీసుకోవటం.. తీసుకున్న అప్పుకు (Loan Interest)  వడ్డీలు కట్టడం చూస్తుంటాం. ఎక్కువ మంది నూటికి రెండు రూపాయల, వందకు మూడు రూపాయలు అంటూ.. వడ్డీ తీసుకొని అప్పులు ఇస్తుంటారు. ఐతే గ్రామీణ ప్రాంతంలో నివసించే వారిలో చాలా మందికి ఈ లెక్కల గురించి సరిగ్గా తెలియదు. దాంతో ఎప్పుడు పక్కవారి సాయం తీసుకోవాలి. లెక్కలు చేసి వడ్డీలు కట్టాలి. ఒక్కోసారి లెక్కలు తెలియవని వారు అధికంగా వడ్డీలు కడుతున్న సందర్బాలు కూడా ఉంటాయి. ఇలా వడ్డీల లెక్కలపై అవగాహన లేక.. తన కళ్ల ముందు ఇబ్బందులు పడుతున్న వాళ్లకోసం.. ఓ కుర్రాడు వడ్డీ లెక్కల యాప్ (Vaddi APP) తయారు చేశాడు.

జగిత్యాల (Jagtial) జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు నరేశ్. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బాల్యం నుండి బయట చదువులు చదివిన నరేశ్‌కు కరోనా లాక్ డౌన్ వల్ల తమ గ్రామంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా చూసే అవకాశం దొరికింది. తమ ఇంటి చుట్టుపక్కలవాళ్లు వడ్డీలకు డబ్బులు తీసుకొని సంవత్సరం తర్వాత వడ్డీ కట్టాల్సి వస్తే..  వాళ్లు చెప్పినంత ఇచ్చి..వచ్చిన సంఘటనలను అతడు కళ్లారా చూశాడు. కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టడం గమనించాడు. ఈ క్రమంలోనే అందరికీ సులువుగా అర్థం అయ్యేలా..ఈజీగా వడ్డీ లెక్కలు వేసుకునేలా.. ఒక యాప్‌ను తీసుకురావాలని అనుకున్నాడు. కొన్ని రోజుల్లోనే పూర్తిస్థాయిలో మొబైల్ యాప్‌ను డెవలప్ చేశాడు. సదరు వ్యక్తి ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులకు నెలకు వడ్డీ ఎంత..? సంవత్సరానికి ఎంత? అనే అంశాలు సులువుగా అర్థమయ్యేలా దానిని రూపొందించాడు.


స్మార్ట్ ఫోన్‌పై కాస్త పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా  ఈ యాప్‌ను ఈజీగా వాడవచ్చు.  తమ సొంతూరిలో చాలా మందికి దీని గురించి వివరించాడు. ఇప్పుడు ఆ యాప్‌ను నరేశ్ ఊరితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా వాడుతున్నారు. ఎంతో మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దాని సాయంతో సులువుగా వడ్డీ లెక్కలు వేస్తున్నారు. వడ్డీపై అవగాహన లేని వారు కూడా.. ఈ మొబైల్ యాప్ ద్వారా చాలా ఈజీగా లెక్కలు చేస్తున్నారు. తెలియని వారికి వివరించేలా గ్రామంలోని చదువుకున్న యువకులకు ట్రైనింగ్ ఇచ్చాడు నరేశ్. వడ్డీకు బారు వడ్డీ, చక్రవడ్డీ పేరుతో కొందరు వ్యాపారుల చేతిలో ప్రజలు మోసపోకుండా.. ఈ కుర్రాడు తయారుచేసిన యాప్ బాాగానే ఉపయోగపడుతుందని.. స్థానికులు చెబుతున్నారు.

No comments:

Post a Comment