Sunday 22 November 2020

వడ్డీ కాలిక్యులేటర్

 


మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన నల్ల నరేశ్‌ వడ్డీ కాలిక్యులేటర్‌ అనే యాప్‌ను రూపొందించారు. 


హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే నరేశ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచే పని చేస్తున్నారు. స్థానికులు వడ్డీ లెక్కలు చేయడంలో పడుతున్న ఇబ్బందులను గమనించారు. ముఖ్యంగా రోజువారీగా వడ్డీని లెక్క కట్టడంలో అయోమయం చెందుతుండడాన్ని చూశారు. వడ్డీ లెక్కలు చేయించుకోవడానికి చుట్టుపక్కల వారు నరేష్‌ను సంప్రదించేవారు. దీంతో సులభమైన పద్ధతిలో చరవాణిలో వడ్డీ లెక్కలు స్థానికులే చేసుకునేలా యాప్‌ రూపొందించాలని అనుకున్నారు.


 ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం పెంచుకున్న ఆయన వడ్డీ కాలిక్యులేటర్‌ పేరుతో యాప్‌ను తయారు చేశారు. యాప్‌ ఓపెన్‌ చేసి ఇచ్చిన డబ్బు, వడ్డీ రేటు, తీసుకున్న తేదీ, చెల్లిస్తున్న తేదీలను నమోదు చేస్తే వడ్డీ ఎంత అయ్యిందో చూపిస్తుంది.


 రోజు వారీగా వడ్డీని లెక్కకడుతుంది. వాయిస్‌ ద్వారా కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్ఛు తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో యాప్‌ ఉపయోగించుకునే విధంగా తయారు చేశారు.

No comments:

Post a Comment